⚡ Initializing Your AI Composer... ⚡
ఆ నీలిమబ్బు కరిగినట్టు ఓ వానజల్లు కురిసినట్టు
ఓ జాబిలమ్మ వచ్చెను ఇటూ నా జానకల్లే మారతానంటూ
ఆమె బొంగరాల కంటి చూపు గుచ్చుకున్నట్టు నా పాదమట్టె ఆగిపోయే సాగనన్నట్టు
ఆమె ఉంగరాల జుట్టు కట్టి లొంగమన్నట్టు నన్ను బందించేసి కవ్విస్తుంటే గుండేలోన గండి పడ్డట్టు
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది
గట్టుదాటేసి పరవళ్లు తొక్కుతున్నదిది
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది
నన్ను చిత్రంగా ఆత్రంగా మార్చేసినది
ఆ నీలిమబ్బు కరిగినట్టు ఓ వానజల్లు కురిసినట్టు
ఓ...... ఊపిరాగినట్టు ఊబిలో పడ్డట్టు
తాను దూరమైతే దారితప్పె నా ప్రాణం
ఓ...... ఊయలూపినట్టు ఊసులాడినట్టు తాను వద్దకొస్తె హద్దు మీరే నా ప్రాయం
మువ్వ ఘళ్లంటూ మోగినట్టు
నవ్వేదో రువ్వుతుంటే
చిందేసి ఆడినట్టి నా ఒళ్ళు
వేద మంత్రాలు చదివినట్టు
తన పేరు చెప్పుకుంటు
తిరుగుతుంటే ఈడు వేసే కుప్పి గంతులు
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది గట్టుదాటేసి పరవళ్లు తొక్కుతున్నదిది
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది నన్ను చిత్రంగా ఆత్రంగా మార్చేసినది
ఓ...... వేణువూదినట్టు వీణమీటినట్టు
ఆమె అడుగులేస్తే జాలువారే సంగీతం
ఓ...... చిక్కిపోయినట్టు సొట్టబడినట్టు
ఆమె నడుముచూస్తే తేనెలూరే సంతోషం
మత్తు మందేదో చల్లినట్టు
మాటేదో వింటూ ఉంటే
లోకాన్ని మరచినట్టి నా కళ్ళు
ప్రేమ ద్వారాలు తెరచినట్టు
తన జంట కోరుకుంటూ
నిద్దట్లోనూ చేస్తున్నాయి ఎన్నో యుద్దాలు
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది
గట్టుదాటేసి పరవళ్లు తొక్కుతున్నదిది
హో.. ఉప్పొంగే ఉప్పొంగే నాలో ప్రేమనది నన్ను చిత్రంగా ఆత్రంగా మార్చేసినది
Sound Of Meme
Achievement progress and rewards
No achievements in progress